ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తంటికొండ ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి - తెదేపా అధినేత చంద్రబాబు వార్తలు

తూర్పుగోదావరి జిల్లా తంటికొండ రోడ్డు ప్రమాదం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

chandrababu and acheniadu condolence in tantikonda accident
తంటికొండ ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

By

Published : Oct 30, 2020, 9:30 AM IST

తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వరాలయం వద్ద జరిగిన ప్రమాదం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి బృందం ప్రయాణించే వాహనం ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు ఉన్నత వైద్యం అందించి, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రమాదం దురదృష్టకరం: అచ్చెన్న

తంటికొండ రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details