ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: స్పందిస్తున్న హృదయాలు.. ప్లాస్మాదానం చేసిన మొదటి మహిళా పోలీసు

కరోనా కట్టడిలో ముందున్న పోలీసులు... ప్లాస్మా దానంలోనూ ముందే ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో ఓ మహిళా అధికారి తొలిసారి ప్లాస్మా దానం చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్​లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సంధ్య ప్లాస్మా ఇచ్చారు. ఆమెను రాచకొండ సీపీ మహేష్ భగవత్​తో పాటు పలువురు అభినందించారు.

By

Published : Aug 20, 2020, 10:52 AM IST

Women_Si_Donate_Plasma
ప్లాస్మా దానం చేస్తున్న ఎస్సై

కరోనా నియంత్రణలో పోలీసు శాఖ ముందు వరుసలో ఉండి పని చేసింది. ఇదే క్రమంలో కొందరు అధికారులు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ నుంచి కోలుకుని తిరిగి విధుల్లో హాజరవుతున్నారు. అయితే కరోనా చికిత్సలో ఉపయోగపడే ప్లాస్మా ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ ప్లాస్మా దానం చేస్తున్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్​లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సంధ్య.. సికింద్రాబాద్ సన్ షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ప్లాస్మా దానం చేశారు. తెలంగాణ పోలీసు శాఖలో ప్లాస్మా దానం చేసిన తొలి మహిళా అధికారి కావడం విశేషం. ఆమెను రాచకొండ సీపీ మహేష్ భగవత్​తో పాటు పలువురు అభినందించారు.

ఇదీ చదవండి:కరోనా రికార్డ్​: దేశంలో ఒక్కరోజే 69,652 కేసులు

ABOUT THE AUTHOR

...view details