ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమ్మాయిల వివాహ వయసు పెంచే యోచనలో కేంద్రం - marriage age of girls latest news

మహిళల వివాహ వయస్సుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో.. సర్వత్రా చర్చ నడుస్తోంది. దేశంలో ప్రసూతి మరణాల రేటు తగ్గించడం కోసం ఆడపిల్లల వివాహ వయసు పెంచే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ప్రకటించిన నాటి నుంచీ మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది కేంద్రం.

Central to the idea of ​​raising the marriage age of girls
అమ్మాయిల వివాహ వయసు పెంచే యోచనలో కేంద్రం

By

Published : Aug 31, 2020, 9:53 AM IST

అమ్మాయిల వివాహ వయసు పెంచే యోచనలో కేంద్రం

మహిళల కనీస వివాహ వయస్సు నిర్ధారణ అంశంలో కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు... పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ అంశాన్ని పునః పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించినట్లు పేర్కొన్నారు. కనీస వివాహ వయస్సు పెంపుపై అధ్యయనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి నుంచి అనేక విషయంపై అనేక స్పందనలు, ప్రతిపాదనలు వస్తున్నాయి.

  • 18 నుంచి 21కి పెంపు

ప్రస్తుతం యువతులకు కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు.. యువకులకు అది 21 ఏళ్లు. కాగా ఈ వయసును మూడు లేదా నాలుగు సంవత్సరాలు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం ఓ అడ్డంకిగా మారకుండా ఉండేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని చూస్తోంది. ఈ అంశాలపై మరింత క్షుణ్నంగా అధ్యయనం తేసేందుకే.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం మహిళలు ఏ వయసులో తల్లి అయితే ఆరోగ్యకరమో అన్న విషయమై అధ్యయనం చేయడానికి ఈ కార్యదళం పని చేస్తుంది. శిశు మరణాలు, మాతృ మరణాలు, సంతాన సాఫల్య రేటు, స్త్రీ-పురుష నిష్పత్తి తదితర అంశాల సమగ్ర పరిశీలన దీని ఉద్దేశం.

  • మహిళా సాధికారత సాధ్యమేనా?

మొత్తంగా కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన నివేదిక ఇచ్చిన తర్వాతే.. తుది నిర్ణయం వెలువడనుంది. అయితే... ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? మహిళా సాధికారిత కోణంలో ఇది సానుకూలమేనా? కొత్త సమస్యలకు కారణం అవుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాన్ని మారుస్తారా ! లేదంటే కొత్త చట్టాన్ని తీసుకొస్తారా అన్న వి।షయం మరికొన్ని రోజుల్లో తేలనుంది.

ఇదీ చూడండి:పెద్దాస్పత్రుల్లో సమయానికి దొరకని పడకలు!

ABOUT THE AUTHOR

...view details