మూడు రాజధానులపై భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యల గురించి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
'నిర్ణయం రాకముందే రాజధానిపై మాట్లాడటం మంచిదికాదు'
మూడు రాజధానుల అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. భారతదేశ చిత్రపటంలో అమరావతికి చోటు దక్కేలా తన వంతు కృషి చేశానని చెప్పారు.
రాజధానిపై ఏపీ ప్రభుత్వం కమిటీలు వేసినట్లు చెబుతోంది. కమిటీల నివేదికలు వచ్చాకే భాజపా కేంద్ర, రాష్ట్ర నేతలు నిర్ణయించుకుని అభిప్రాయం వ్యక్తం చేస్తాం. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉంటుంది. మూడు రాజధానులు ఎలా అమలు చేస్తారు.. విధివిధానాలేంటని కేంద్రమంత్రిగా మాట్లాడతాను. రాజధానిపై నిర్ణయం రాకముందే భాజపా నేతలు మాట్లాడటం మంచిది కాదు. భాజపా రాష్ట్ర నేతలు కూర్చొని చర్చిస్తారు. అప్పటి వరకు సంయమనంతో ఉండాలి.
- కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి
ఇదీ చదవండి: అమరావతి మలిదశ ఉద్యమం: సకలజనుల సమ్మెకు సన్నద్ధం