ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kishan Reddy Meet Chiranjeevi: జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి ప్రత్యేక అతిధిగా చిరంజీవి - National Cultural Festival

Kishan Reddy Meet Chiranjeevi: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్​ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్​ చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కలిసి ఆహ్వానించారు.

రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్​కు చిరంజీవికి ఆహ్వానం
రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్​కు చిరంజీవికి ఆహ్వానం

By

Published : Mar 6, 2022, 3:52 PM IST

Updated : Mar 6, 2022, 4:09 PM IST

Kishan Reddy Meet Chiranjeevi: హైదరాబాద్ వేదికగా మరో జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్​ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్​లో మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్​లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి... మెగాస్టార్ చిరంజీవిని రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్​కు ఆహ్వానించారు.

కిషన్ రెడ్డి ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి..సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామి కానుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని జానపద, గిరిజన, వృత్తి కళాకారుల జీవనోపాధికి ఈ వేడుక చక్కని వేదిక అవుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: సహచరుడి కాల్పుల్లో ఐదుగురు బీఎస్​ఎఫ్​ జవాన్లు మృతి

Last Updated : Mar 6, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details