పోలవరంపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, తాజా పరిస్థితులపై కేంద్రం ఆరా తీసింది. ప్రాజెక్టు నిర్మాణ సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని(పీపీఏ) కేంద్రం కోరింది. వాస్తవ పరిస్థితిని నివేదించాలని పీపీఏకు ఆదేశాలు జారీచేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా నివేదిక ఇవ్వాలని జలశక్తి మంత్రిత్వ శాఖ కోరింది. టెండర్ల రద్దు, రివర్స్ టెండరింగ్ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. రివర్స్ టెండరింగ్ వద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ సూచించింది. పీపీఏ లేఖ రాసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పీపీఏ సీఈవో ఆర్.కె.జైన్‌ను కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ఆదేశించారు. పోలవరం తాజా పరిస్థితి, రివర్స్ టెండరింగ్ అంశాలపై పీపీఏ నివేదిక ఇచ్చాక కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. సమగ్ర నివేదిక రూపొందిస్తున్నామని పీపీఏ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :