ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ పేరు చెబితే శత్రువు గుండెల్లో గుబులు ఖాయం: రాజ్‌నాథ్‌ - రాజ్​నాథ్​సింగ్

వాయుసేనలో సుదీర్ఘకాలంగా చేతక్ హెలికాప్టర్లు సేవలందిస్తున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌ హకీంపేటలో నిర్వహించిన చేతక్‌ హెలికాప్టర్ల వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులు హాజరయ్యారు.

Rajnath singh
Rajnath singh

By

Published : Apr 2, 2022, 9:43 PM IST

దేశ రక్షణ వ్యవస్థలో చేతక్ హెలికాప్టర్‌ది ప్రత్యేక స్థానమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌ హకీంపేటలోని నిర్వహించిన చేతక్‌ హెలికాప్టర్ల వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకలకు ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులు హాజరయ్యారు. చేతక్‌ హెలికాప్టర్లు వాయిసేనకు సుదీర్ఘకాలం విశేష సేవలందించాయని గుర్తు చేశారు. మన చేతక్ పేరు చెబితే శత్రువు గుండెల్లో గుబులు పుడుతుందని అన్నారు.

ఆ పేరు చెబితే శత్రువు గుండెల్లో గుబులు ఖాయం: రాజ్‌నాథ్‌

"రాణాప్రతాప్ గుర్రం పేరు చేతక్.. దాని చరిత్ర విన్నాం. మన చేతక్ పేరు చెబితే శత్రువు గుండెల్లో గుబులు ఖాయం. చూసేందుకు చిన్నదైనా చేతల్లో విధ్వంసం చేయగల సత్తా చేతక్​కు ఉంది. చేతక్ హెలికాప్టర్లు.. వాయుసేనకు విశేష సేవలు అందించాయి. ఎలాంటి విపత్తు వచ్చినా చేతక్ ఉపయోగించాల్సిందే."

ABOUT THE AUTHOR

...view details