ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandrababu: జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ.. 2.3 లక్షల ఉద్యోగాలేవీ?: చంద్రబాబు - tdp leader chandrababu

జగన్ పాలనలో రాజ్యంగ వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని.. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ, 2.3 లక్షల ఉద్యోగాలేవీ?. నాడు అన్ని హామీలిచ్చారు.. ఒక్కటైనా నెరవేర్చారా? అని జగన్‌కు చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో మేధావులు, యువత.. ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు.

cbn fires on ysrcp govt debts
cbn fires on ysrcp govt debts

By

Published : Feb 11, 2022, 1:33 PM IST

Updated : Feb 12, 2022, 5:44 AM IST

Chandrababu fire on Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికల ప్రచారంలోను, అంతకుముందు వివిధ సందర్భాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు.. ఆ తర్వాత సీఎం అయిన తర్వాత మాట మార్చిన విధానానికి సంబంధించిన వీడియోలను చంద్రబాబు విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఉద్యోగుల విషయంలో చేసినవి, ఆర్థికపరిస్థితిపై చెబుతున్న మాటలు, ఉద్యోగ ఖాళీల భర్తీ, అంగన్‌వాడీల జీతాలు.. ఇలాంటి అంశాలపై సీఎంకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

  • రెచ్చగొట్టారు.. ఇప్పుడు తాకట్టు పెట్టారు..
    ఎన్నికల ముందు ప్రత్యేక హోదాపై జగన్‌: తెదేపా ఎంపీలంతా రాజీనామా చేసి రండి. మా ఎంపీలనూ పంపిస్తా. నిరాహారదీక్షకు కూర్చుందాం. కేంద్రం దిగి రాదేమో చూద్దాం.. దేశమంతా మనవైపు చూస్తుందో లేదో చూద్దాం. యుద్ధం అని దీన్నంటారు. ఇలా చెయ్యాలని సామాన్యులు అడుగుతారు. ఇలా చేస్తేనే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని నా దగ్గర నుంచి సామాన్యుల వరకూ అందరికీ తెలిసిన విషయమే.
    సీఎం అయ్యాక: కేంద్రంలో భాజపాకు మెజార్టీ రాకపోతే మనతో అవసరం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు. ప్రత్యేక హోదా మనకు దూరంగా కనిపిస్తోంది.
    చంద్రబాబు:పెయిడ్‌ ఆర్టిస్టుల్ని పెట్టుకుని అప్పట్లో ఎంతలా రెచ్చగొట్టారు? కేసులు మాఫీ అయితే చాలు, మళ్లీ జైలుకు పోకుంటే చాలు. చివరకు రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు.
  • ఉద్యోగుల్లో అశాంతి తెచ్చారు
    సీపీఎస్‌, పీఆర్సీలపై ప్రతిపక్షనేతగా జగన్‌: మనం అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దుచేస్తామని ప్రతి ఉద్యోగికి హామీ ఇస్తున్నా. ఉద్యోగులు కోరుకున్నట్లు అధికారంలోకి రాగానే 27% ఐఆర్‌ ప్రకటిస్తాం. సకాలంలో పీఆర్సీ అమలుచేస్తామని హామీ ఇస్తున్నా. కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేసిన కాలాన్ని, విద్యార్హతల్ని పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తాం. పొరుగుసేవల విధానంలో వారికి సమాన పనికి, సమాన వేతనం తెస్తామని హామీ ఇస్తున్నా.
    చంద్రబాబు: మేం ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నాం అంటున్నారు. అప్పుడు మీరేం అన్నారో సమాధానం చెప్పండి. నాడు రూ.22వేల కోట్ల రెవెన్యూ లోటులోనూ మీకంటే మెరుగైన జీతాలు, వసతులు కల్పించాం. మీరు ఏదీ చేయకుండా ఉద్యోగుల్ని మోసం చేశారు.
  • బాదుడే బాదుడు..
    ఎన్నికల ప్రచారంలో జగన్‌: ఈ ప్రభుత్వ హయాంలో కరెంటుఛార్జీలు, పెట్రోలు రేట్లు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, స్కూలు, కాలేజీ ఫీజులు బాదుడే.. బాదుడు.
    చంద్రబాబు: ఇప్పుడు ఆయన జనం మధ్యకు పోతే బాదుడే బాదుడు అవుతుంది. ఏం వదిలిపెట్టారు?.
  • ఉద్యోగాలిచ్చే బాధ్యత మీకు లేదా?
    ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రతిపక్ష నేతగా జగన్‌: మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని చెబుతున్నా. ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇస్తున్నా.
    చంద్రబాబు:జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని నిరుద్యోగులు అడుగుతున్నారు. మీరు చెప్పిన 2.30 లక్షల ఉద్యోగాలిమ్మని అడుగుతున్నారు. ఆ బాధ్యత మీకు లేదా? అప్పట్లో పేటీఎం బ్యాచ్‌ పెట్టి కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి రెచ్చగొట్టారు. ఇప్పుడు యువత, విద్యార్థులు తమ ఉద్యోగాలనే అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. చేయలేకపోతే చేతకాదని ఒప్పుకొని క్షమాపణ చెప్పండి.
  • అడుక్కునే పరిస్థితికి జగన్‌ కారణం కాదా?
    సచివాలయంలో సమీర్‌శర్మ: నాలుగేళ్ల నుంచి ఏడాదికి రూ.60వేల కోట్ల ఆదాయం ఉంది. ప్రతి ఏటా 15% ఆదాయం పెరగాలి. కానీ కొవిడ్‌ వల్ల పెరగలేదు. మొత్తంగా మూడేళ్లలో రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల ఆదాయం తగ్గింది.
    సీఎం జగన్‌: ఇంత డబ్బు ఒక్కసారి ఇవ్వాలంటే.. చాలా టైట్‌ పరిస్థితి కనిపిస్తోంది.
    లోక్‌సభలో ఎంపీ మార్గాని భరత్‌: జీతాలు చెల్లించేందుకు మా దగ్గర నిధులు లేవు. చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. దయతో అర్థం చేసుకోండి.
    మిథున్‌రెడ్డి: ఏపీపై సానుభూతి చూపండి. దయచేసి సాయం చేయాలని ప్రధాని, ఆర్థికమంత్రిని కోరుతున్నా. ఏపీ పునర్విభజన చట్టం కాలవ్యవధి మరో రెండేళ్లే ఉంది.
    చంద్రబాబు: వీరంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఉద్యోగులకు జీతాలివ్వలేకపోయామని మాట్లాడుతున్నారు. అడుక్కునే పరిస్థితికి వచ్చారు. ఎవరు దీనికి కారణం.. జగన్‌మోహన్‌రెడ్డి కాదా?
  • అసత్యం చెప్పడానికి సిగ్గనిపించడం లేదా?
    సీఎం అయ్యాక జగన్‌: అంగన్‌వాడీ వర్కర్లకు బాబు హయాంలో రూ.7వేల జీతం ఇస్తే మన ప్రభుత్వం వచ్చాక రూ.11,500 చేశాం. అంగన్‌వాడీ మినీ వర్కర్లకు బాబు హయాంలో రూ.4,500 ఉంటే మనం వచ్చాక రూ.7వేలకు పెంచాం.
    చంద్రబాబు: నేను సీఎంగా ఉన్నప్పుడు అంగన్‌వాడీ వర్కర్లకు రూ.4,200 నుంచి రూ.7వేలు చేశాను. మళ్లీ రూ.7వేల నుంచి రూ.10,500 చేశాను. మినీ అంగన్‌వాడీలకు రూ.2,200 నుంచి రూ.4,500.. తర్వాత రూ.6వేలు చేశాను. కానీ తామే రూ.7వేల నుంచి రూ.11,500 చేశామని సిగ్గులేకుండా చెబుతున్నారు. ఆయన ఇచ్చింది వెయ్యి రూపాయలే. ముఖ్యమంత్రి పదవి, కుర్చీకే ఇది అవమానం. అసత్యాలు చెప్పకూడదు.
Last Updated : Feb 12, 2022, 5:44 AM IST

ABOUT THE AUTHOR

...view details