అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. రఘురామ కృష్ణరాజు, జగన్ ఇప్పటికే వాదనలు వినిపించటంతో పాటు కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ వాదన. తాను ఒక్క షరతు కూడా ఉల్లంఘించలేదని.. రఘురామ రాజకీయ ప్రయోజనాల కోసం కేసుకు సంబంధం లేని ఊహా జనిత అంశాలతో పిటిషన్ వేశారని జగన్ వాదన.
Jagan bail cancel petition: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్పై నేడు మరోసారి విచారణ
అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. రఘురామ, జగన్ ఇప్పటికే వాదనలు వినిపించటంతో పాటు కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. నేడు సీబీఐ తన వాదనలను సమర్పించనుంది.
సీబీఐ
తాము వాదించేదేమీ లేదని.. విచక్షణ మేరకు చట్టప్రకారం పిటిషన్లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ.. ముందుగా పేర్కొంది. అయితే... ఆ తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్న సీబీఐ... తాము కూడా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపింది. ఇందుకు పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న ధర్మాసనాన్ని కోరింది. అంగీకరించిన సీబీఐ కోర్టు నేటికి... వాయిదా వేసింది. ఇవాళ సీబీఐ ఏం చెప్పబోతోందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదీ చదవండి:
CM JAGAN CASES: 'సీబీఐ కేసులతో సంబంధం లేకుండా విచారించొచ్చు'
Last Updated : Jul 26, 2021, 6:15 AM IST