ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎంపై అసత్య ప్రచారం.. ఎనిమిది మందిపై కేసు - సీఎం పాలనపై అసత్య ప్రచారం

సీఎం జగన్ చనిపోయారని, ప్లాస్టిక్‌ బియ్యం పంచుతున్నారని వాట్సప్‌ స్టేటస్‌లలో అసత్య ప్రచారం చేస్తున్న ఎనిమిది మందిపై నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో కేసు నమోదైంది. సీఎం పాలనపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదుతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

spreading rumers on govt and cm
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం

By

Published : Jul 15, 2021, 8:44 AM IST

సీఎం జగన్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో ఎనిమిది మందిపై బుధవారం కేసు నమోదు చేశారు. సీఎం పాలనపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మండలంలోని బీరంగుంటకు చెందిన గరిక నరసింహరావు ఫిర్యాదు చేశారు. సీఎం చనిపోయారని, ప్లాస్టిక్‌ బియ్యం పంచుతున్నారని వాట్సప్‌ స్టేటస్‌లలో పెడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారించి అదే గ్రామానికి చెందిన ప్రతాప్‌, ప్రదీప్‌, చైతన్య, రామకృష్ణ, రఘురాం, బాలచందర్‌, నవీన్‌కుమార్‌, నరేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details