రాజధాని రైతుల ఆందోళన 36వ రోజుకు చేరింది. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ... కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్‌కు ఐకాస పిలుపునిచ్చింది. పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణ కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. మందడం, తుళ్లూరులో రైతులు మహాధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలోనూ రైతులు రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు... ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాల ఆందోళనలు చేస్తున్నాయి.
పాఠశాలలకు సెలవు
గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు సెలవు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. అమరావతి రాజకీయ ఐకాస ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పాఠశాలలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.