High Court on Capital cases రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై ఎవరైనా సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేశారా అన్న ధర్మాసనం ప్రశ్నకు... రాజధాని రైతుల తరపు న్యాయవాదులు ఎస్ఎల్పీ వేశారని ఏజీ సమాధానం ఇచ్చారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము కోరిన అభ్యర్ధనలను తిరస్కరించి వాటిపై మాత్రమే ఎస్ఎల్పీ వేశామని రాజధాని రైతుల తరపు న్యాయవాది మురళీధర్ అన్నారు. రాజధాని తీర్పుపై తాము సంతోషంగా ఉన్నామని మురళీధర్ తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి ఎస్ఎల్పీ వేశారా హైకోర్టు అడగగా.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసే అంశం ప్రాసెస్‌లో ఉందని ఏజీ వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగా హైకోర్టు విచారించడం భావ్యమా అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. తాము రైతుల నష్ట పరిహరం విషయంలో మాత్రమే సుప్రీంకు వెళ్లామని.. అది హైకోర్టులో విచారణకు ప్రతిబంధకం కాబోదని మురళీధర్ తెలిపారు. ప్రభుత్వం వేసిన స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని.. రైతుల తరఫు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 17కు వాయిదా వేసింది.
High Court on Capital cases అమరావతి కేసులపై హైకోర్టులో విచారణ
High Court on Capital cases అమరావతి రాజధాని తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. రాజధానికి సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. అమరావతిలో అభివృద్ధి పనులపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హైకోర్టు విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది.
హైకోర్టు