CAG Report: రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు ఫిబ్రవరి నుంచి మార్చి నెలకు తగ్గిన నేపథ్యంలో మార్చిలో వచ్చిన అదనపు ఆదాయం రూ.20,371.12 కోట్లు ఏం చేసినట్లు? సోమవారం కాగ్ తాజా లెక్కలు వెల్లడైన నేపథ్యంలో ఇలా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23కు సంబంధించి అనుబంధ లెక్కలు వెల్లడించినా ఈ అనుమానాలు నివృత్తి కాలేదు. ప్రతి నెలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాల వివరాలను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌కు సమర్పిస్తారు. ఆ తర్వాత ఏ నెలకు ఆ నెల రాష్ట్ర ఆదాయం, ఖర్చుల వివరాలను కాగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. మార్చి నెలాఖరు వరకున్న ప్రాథమిక లెక్కలను 2022 జూన్‌లో తేల్చి వెబ్‌సైట్‌లో ఉంచారు. అప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల మధ్య అర్థంకాని వ్యత్యాసం ఉండటంపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. తమ అనుమానాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది.
రూ.వేల కోట్ల ఖర్చు ఎందుకు, ఎలా తగ్గించారో వివరాలు తెలియజేయలేదని ప్రశ్నించింది. తాము కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వకుంటే ఆ మొత్తాన్ని సస్పెన్స్ ఖాతాగా చూపించి 2021-22 ఆర్థిక సంవత్సరం లెక్కలను తేలుస్తామని చెప్పింది. ఆ లేఖ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాగ్ ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రాష్ట్రాల లెక్కలూ ఎప్పుడో ఖరారయ్యాయి. ప్రాధమిక లెక్కల నుంచి అనుబంధ లెక్కలను తేల్చి వెబ్‌సైట్‌లో ఉంచేందుకు 3నెలల సమయం పట్టింది. రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి కాగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరుకు రాష్ట్ర ఆదాయవ్యయాల వివరాలు పరిశీలించి తిరిగి మార్చి నెలాఖరు నాటికి పోలిస్తే భారీ తేడా కనిపిస్తోంది.
ఇవీ అనుమానాలు:రాష్ట్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరి నెలాఖరు వరకు తీసుకున్న రుణం రూ.52,164 కోట్లుగా కాగ్ వెబ్‌సైట్ చెబుతోంది. మార్చి నెలాఖరుకు ఆ రుణం రూ.25,012.74 కోట్లకు తగ్గింది. ఇందులో ప్రజాపద్దు కింద రూ.39,363 కోట్లు, ప్రజాఖాతా కింద రూ.14,311 కోట్లు మినహాయించి చూపారు. ఒక ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలనుంచి ఆ ఏడాది అసలు ఎంత తీర్చేశారో ఆ మొత్తం మినహాయించి ప్రజారుణం తేలుస్తారు. ప్రజారుణం అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే బహిరంగ మార్కెట్ రుణం, నాబార్డు రుణాలు, కేంద్రం నుంచి వచ్చే రుణాలన్నీ కలిపి ఉంటాయి. అదే సమయంలో ప్రజాపద్దు నుంచి ప్రభుత్వం అప్పు రూపంలో తీసుకుంటుంది.
వివిధ కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, ఉద్యోగుల భవిష్య నిధికి వసూలయ్యే మొత్తాలు ఇలాంటివి కూడా వినియోగించుకుంటూ ఉంటుంది. నికర ప్రజారుణం తేల్చే క్రమంలో ప్రజాఖాతాను కూడా కలిపి పరిగణించడం వల్లే మొత్తం రుణం తగ్గించి చూపారన్న విమర్శకు తాజా లెక్కల్లోనూ సమాధానం లేదు. ప్రజాఖాతా నుంచి తీసుకున్న రుణం తిరిగి ఎంత చెల్లించారో ఆ మొత్తం పరిగణనలోకి తీసుకుని లెక్కలు వెల్లడించిన ఆర్థికశాఖ అధికారులు.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రజాఖాతా ద్వారా ఎంత మొత్తం రుణం వినియోగించుకున్నారో ఆ లెక్కలు పరిగణనలోకి తీసుకోలేదనే అంశం కూడా చర్చనీయాంశమవుతోంది.
* రాష్ట్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరి వరకు చేసిన ఖర్చు: రూ.1,81,680.30 కోట్లు