తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తలకొండపల్లి మండలం మెదక్పల్లిలో శ్రీకాంత్‌కు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లారితే పెళ్లి అనగా పెళ్లికుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే.. ఇంట్లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ: పెళ్లింట విషాదం... ఉరేసుకుని వరుడు ఆత్మహత్య - వరుడు ఆత్మహత్య
ఇల్లంతా దగ్గరి బంధువులతో కళకళలాడుతోంది. శుభకార్యం కోసం ఇల్లు అందంగా ముస్తాబవుతోంది. పెద్దలంతా వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అప్పటివరకు ఆనందంతో గడిపినవాళ్లు.. ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు. పెళ్లికొడుకు ఆత్మహత్య వారందరి సంతోషాల్ని కన్నీటిపాలు చేసింది.
పెళ్లింట విషాదం... ఉరేసుకుని వరుడు ఆత్మహత్య
వరుడి ఆత్మహత్య ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్