ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Entrance Examination Schedule: ఈ ఏడాది వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ ఇదే.. - PGESET

Exams
Exams

By

Published : Apr 5, 2022, 2:57 PM IST

Updated : Apr 5, 2022, 3:19 PM IST

14:51 April 05

జులై 4 నుంచి జులై 12 వరకు ఈఏపీసెట్‌

Entrance Examination Schedule: రానున్న విద్యా సంవత్సరానికి వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌) ను జులై 4 నుంచి జులై 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎల్ఎల్​బీ ప్రవేశాల కోసం లాసెట్, బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం పీజీ ఎల్‌సెట్‌ పరీక్షను జులై 13న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జులై 18 నుంచి జులై 21 వరకు పీజీ ఈసెట్‌ నిర్వహించనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం జులై 25న ఐసెట్‌ జరగనుంది. జులై 22న ఈసెట్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది.

ఆయా ప్రవేశ పరీక్షల తేదీలు..

  • జులై 4 నుంచి జులై 12 వరకు ఈఏపీసెట్‌
  • జులై 13న ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌
  • జులై 18 నుంచి జులై 21 వరకు పీజీ ఈసెట్‌
  • జులై 22న ఈసెట్‌
  • జులై 25న ఐసెట్‌

ఇదీ చదవండి:SSC Exams at AP: పదో తరగతి పరీక్షల్లో.. భారీ సంస్కరణలు

Last Updated : Apr 5, 2022, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details