ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలను పరిరక్షించాలంటూ దిల్లీలో భాజపా, జనసేన నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దిల్లీలోని నివాసంలో భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ దీక్షలో పాల్గొన్నారు. జీవీఎల్‌తో పాటు ఏపీ భాజపా ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్ కూడా నిరసన దీక్షలో పాల్గొన్నారు.
అంతర్వేది ఘటనకు వ్యతిరేకంగా దిల్లీలో భాజపా నిరసన - అంతర్వేది ఘటనపై వార్తలు
అంతర్వేది ఘటనపై సీఎం న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో భాజపా, జనసేన నేతలు నిరసన చేపట్టారు. దుండగులను శిక్షించాలని కోరారు.
అంతర్వేది ఘటనకు వ్యతిరేకంగా దిల్లీలో భజాపా నిరసన
లక్ష్మీనరసింహస్వామికి జీవీఎల్ పూజలు నిర్వహించారు. అంతర్వేది ఘటనపై సీఎం న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం
Last Updated : Sep 10, 2020, 12:22 PM IST