ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశంపై భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మండిపడ్డారు. ప్రస్తుతం కావలసింది సుశిక్షుతులైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలని సూచించారు. జగన్ రాష్ట్రాన్ని జెరూసలెంకు తాకట్టు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మాతృభాషలో చదివిన అబ్దుల్ కలాం, గాంధీజీ గొప్ప వ్యక్తులు కాలేదా అని ప్రశ్నించారు. తెలుగు మాధ్యమంలో చదివి సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ డాక్టర్, ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు.
'తెలుగు మాధ్యమంలో చదివిన వైఎస్ఆర్ డాక్టర్ కాలేదా...?' - updates on telugu laguage contraversy
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కావలసింది మౌలిక వసతులు, సుశిక్షుతులైన ఉపాధ్యాయులని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. మాృతభాషలో చదివిన ఎంతోమంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని... సీఎం జగన్ తండ్రి వైఎస్ మాతృభాషలో చదివి డాక్టర్, సీఎం అయ్యారని ట్వీట్ చేశారు.
తెలుగు భాషపై సత్య కుమార్
ఆంగ్ల మాధ్యమంలో చదివిన జగన్ డిగ్రీ పూర్తి చేయడానికే అనేక కష్టాలు పడి ఏ భాషలోనూ ప్రావీణ్యం సంపాదించలేకపోయారని ఎద్దేవా చేశారు. పేదల పేరు చెప్పి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కడపలో, 1500 మంది పేద విద్యార్థినులు చదివే ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో కేవలం 4 మరుగుదొడ్లే వున్నాయన్న విషయం తెలుసా అని వైకాపా ప్రభుత్వాన్ని నిలదీశారు.
Last Updated : Nov 11, 2019, 4:08 PM IST