భాజపాలో అంతా సంఘటితంగా రాజధానికి మద్దతుగా ఒకేమాట మీద నిలబడ్డామని మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి స్పష్టంచేశారు. భాజపా తరుపున రైతు సోదరులకు తమ సంఘీభావం తెలియజేస్తున్నామన్నారు. 200 రోజులుగా అమరావతి కోసం నిరసనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాజధాని తెలుగు వారి సమస్య అని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి అమరావతితో ముడిపడి ఉంది : పురంధేశ్వరి
అమరావతి రైతుల పోరాటానికి భాజపా పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి స్ఫష్టం చేశారు. మూడు పంటలు పండే 34 వేల ఎకరాలు రాజధాని కోసం రైతుల త్యాగం చేశారని ఆమె అన్నారు. రాజధాని ప్రతి తెలుగు వారి సమస్య అన్న ఆమె... రాష్ట్ర అభివృద్ధి అమరావతితో ముడిపడి ఉందన్నారు.
పురంధేశ్వరి
మహిళలను అనేక రకాలుగా ఇబ్బందులుకు గురి చేసినా రాజధాని కోసం పట్టువదల్లేదన్నారు. ఏపీలో రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నారని పురంధేశ్వరి విమర్శించారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశమన్నారు. రైతులు 3 పంటలు పండే 34 వేల ఎకరాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదని పురంధేశ్వరి స్పష్టంచేశారు.
ఇదీ చదవండి :భూమిపూజలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీని అడ్డుకున్న గ్రామస్థులు