జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను ఆకు రౌడీని కాదని... పవన్ కల్యాణే స్టేడ్ రౌడీ.. ఆయన అనుచరులు ఆకు రౌడీలని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో జనసేన సైనికుల కామెంట్లు చూస్తే ఓ పార్టీ అధినేతగా పవన్ ఆత్మహత్యాయత్నం చేస్తారని వ్యాఖ్యానించారు.
ఈ మధ్య పవన్ కల్యాణ్ నాపై కొన్ని విమర్శలు చేశారు. ఆకు రౌడీని అంటూ అవగాహన లోపంతో విమర్శించారు. అబద్ధాలను ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. అర్బన్ బ్యాంక్ లో కుంభకోణమంటూ నాపై పవన్ చేసిన ఆరోపణలపై గతంలోనే స్పష్టమైన వివరణ ఇచ్చాను. ఈ విషయంలో ఇప్పటి వరకూ నాపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ముందస్తు బెయిల్ వంటి వాటి కోసం కూడా ప్రయత్నం చేయలేదు. భీమవరం, గాజువాకలో ఓడిపోయారన్న బాధలో ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేయటం దారుణం. జన సైనికులను సంఘ విద్రోహ శక్తులుగా మార్చటంలో పవన్ పాత్రే ఎక్కువగా ఉంది. నేను ఆకు రౌడీని కాదు...మీరే స్టేట్ రౌడీ.. జనసైనికులు ఆకు రౌడీలు. వీటిపై పెటెంట్ మీకే ఉంది. - గ్రంధి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే