ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ రెండో విడత క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి

ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్.. కొవాగ్జిన్​ రెండో దశ క్లినికల్ ట్రయల్స్​కు భారత ఔషధ నియంత్రణ సంస్థ పచ్చ జెండా ఊపింది. జులై మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో కొవాగ్జిన్​ వ్యాక్సిన్ తొలి విడత క్లినికల్ ట్రయల్స్​కి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా 350 మందికి పైగా తొలి విడత ట్రయల్స్​లో పాల్గొన్నారు.

bharat-biotech-kovaxin-got-approval-for-second-time-clinical-trials
భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ రెండో విడత క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి

By

Published : Sep 4, 2020, 10:59 PM IST

ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ మొదటి దశలో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో రెండో విడత ప్రయోగాలకు అనుమతి ఇస్తున్నట్లు భారత ఔషధ నియంత్రణ సంస్థ పేర్కొంది. ఇక రెండో విడతలో 380 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది. కొవాగ్జిన్​కి సంబంధించి రాష్ట్రంలోని నిమ్స్​లో సైతం ఫేజ్ వన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.

జులైలో నిమ్స్​లో 50 మందికి తొలి విడత డోస్ ఇచ్చిన వైద్యులు... వారికి తిరిగి 14 రోజుల తర్వాత బూస్టర్ డోస్​ని సైతం ఇచ్చారు. ఇక రెండో దశ క్లినికల్ ట్రయల్స్​ని కూడా త్వరలో నిమ్స్​లో ప్రారంభించనున్నట్టు నిమ్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం ఆరోగ్యవంతమైన వాలంటీర్ల రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details