కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పని చేస్తున్న వైద్య సిబ్బందికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 10 శాతం పడకలు కేటాయించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. డాక్టర్లు, నర్సులు, వార్డు స్టాఫ్‌లకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 10 శాతం పడకలు కేటాయించాలని సొసైటీ ఫర్ గవర్నమెంట్ డాక్టర్స్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్... ఆ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో పని చేసే వైద్య సిబ్బందికి 10శాతం పడకలు రిజర్వు చేస్తూ ఆదేశించారని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పడకలు కేటాయించాలని పిటిషనర్ కోరారు. సొసైటీ ఫర్ గవర్నమెంట్ డాక్టర్స్ సంస్థ ప్రభుత్వానికి ఎటువంటి రిప్రజంటేషన్ ఇవ్వలేదని ప్రభుత్వం తెలిపింది. ప్రతి వాదులకు ధర్మాసనం నోటిసులు జారీ చేసింది. కేసు విచారణ 4 వారాలకు వాయిదా పడింది.
corona: వైద్య సిబ్బందికి ఆస్పత్రులలో పడకల కేటాయింపుపై విచారణ.. - doctors demands at andhra pradesh
కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పని చేస్తున్న వైద్య సిబ్బందికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 10 శాతం పడకలు కేటాయించాలని హైకోర్టులో సొసైటీ ఫర్ గవర్నమెంట్ డాక్టర్స్ సంస్థ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రతి వాదులకు నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా పడింది.
beds reservation for medical staff in government hospitals
ఇదీ చదవండి: