తెలంగాణలోని జనగామ జిల్లా జాఫర్గడ్ హిమ్మత్‌నగర్‌లో ఎలుగుబంటి(Bear) కలకలం రేపింది. గ్రామంలోని చింతచెట్టుపై తిష్ఠ వేసిన ఎలుగుబంటి... నాలుగు గంటలకుపైగా చెట్టుపైనే ఉండడం వల్ల… గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
Bear: చింతచెట్టుపై ఎలుగుబంటి.. మత్తుమందు ఇచ్చి బంధించి.. - హల్చల్
తెలంగాణలోని జనగామ జిల్లా జాఫర్గడ్ హిమ్మత్‌నగర్‌లో ఎలుగుబంటి(Bear) హల్చల్ సృష్టించింది. స్థానిక చింతచెట్టుపై కూర్చున్న ఎలుగుబంటి.. నాలుగు గంటలకు పైగా చెట్టుపైనే ఉండటం వల్ల స్థానికులు భయాందోళన చెంది.. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఎలుగుబంటిని బంధించి తీసుకెళ్లారు.
bear
స్థానికుల సమాచారంతో వరంగల్ నుంచి వచ్చిన అటవీ శాఖ రెస్క్యూ టీం అధికారులు… గంటకుపైగా శ్రమించి మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు. స్థానిక
అటవీ ప్రాంతంలో వదిలేస్తామని సిబ్బంది తెలిపారు. ఎలుగుబంటిని అధికారులు బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి:VIVEKA CASE: వైఎస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ