BC Meetings: రాష్ట్రవ్యాప్తంగా బీసీ సదస్సులు నిర్వహించేందుకు వైకాపా సిద్ధమైంది. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ సదస్సులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సదస్సుల ద్వారా ప్రజల్లోకి పార్టీ ఉద్దేశాలు, విధానాలను ఎలా తీసుకువెళ్లాలనే అంశాలపై గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ మంత్రులు చర్చించారు. బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారందరినీ భాగస్వాములను చేస్తూ ఈ సదస్సులు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు.
BC Meetings: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 15 తర్వాత బీసీ సదస్సులు: మంత్రి వేణుగోపాలకృష్ణ
BC Meetings: రాష్ట్రవ్యాప్తంగా బీసీ సదస్సులు నిర్వహించేందుకు వైకాపా సిద్ధమైంది. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ సదస్సులు చేపట్టాలని నిర్ణయించారు.
"బీసీ ఉప ప్రణాళిక కింద రూ.31వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం బీసీలకు చేసిన మంచిని వారికి వివరించడంతోపాటు, ఏవైనా లోపాలున్నట్లు తేలితే వెంటనే పరిష్కార మార్గాలు చూసేలా ఏప్రిల్ 15 తర్వాత బీసీ సదస్సులు చేపట్టనున్నాం. మొదట కొత్త జిల్లాల్లో చేపట్టి చివరగా మే రెండో వారంలోగా రాష్ట్ర స్థాయి సదస్సునూ నిర్వహిస్తాం. ఆ సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. కొత్తగా బీసీలకు ఏం చేయబోతున్నామో ఆ సందర్భంగా ప్రకటించే అవకాశాలున్నాయి" -చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి
ఇదీ చదవండి: YS Viveka murder case: జైల్లో శివశంకర్రెడ్డిని కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు