విశేష పూజలందుకుంటున్న ఖైరతాబాద్ మహా గణపతి - minister talasani srinivas yadav
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతి విశేష పూజలందుకుంటున్నారు. ఖైరతాబాద్ మహా గణపతిని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఎంపికైన బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని, నగర సీపీ అంజనీకుమార్ దర్శించుకున్నారు.
వినాయక చవితిని పురస్కరించుకుని తెలంగాణలోని హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి విశేష పూజలందుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రి తలసాని, కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఎంపికైన బండారు దత్తాత్రేయ, హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ వినాయకున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయను తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఉత్సవ సమితి ఘనంగా సత్కరించారు.
- ఇదీ చూడండి :
- మట్టి గాజుల గణపయ్యకు ముస్లింల ప్రసాదం...