5Kgs Baby Born: తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో ఐదు కిలోల బరువుతో ఆడశిశువు జన్మించింది. సాధారణంగా మూడు నుంచి మూడున్నర కిలోల వరకు మాత్రమే ఆడ, మగ శిశువులు జన్మిస్తూ ఉంటారు. కానీ ఐదు కిలోల ఆడ శిశువు జన్మించడం అరుదని వైద్యులు తెలిపారు. దుమ్ముగూడెం మండలం దబ్బనూతుల గ్రామానికి చెందిన గంగాభవాని... రెండోకాన్పులో ఐదు కిలోల ఆడశిశువుకు జన్మనిచ్చింది. శిశువు బరువు ఎక్కువ ఉందని గమనించి... శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు.
5 KGS BABY: ఐదు కిలోల బరువుతో శిశువు జననం... ఎక్కడంటే..? - Baby Born with 5Kgs weight
5Kgs Baby Born: సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువులు మూడు నుంచి మూడున్నర కిలోల వరకు మాత్రమే ఉంటారు. కానీ తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో ఐదు కిలోల బరువుతో ఆడశిశువు జన్మించింది.
ఐదు కిలోల బరువుతో శిశువు జననం