'చలో ఆత్మకూరు'.. దేవినేని అవినాష్ అరెస్ట్ - undefined
'ఛలో ఆత్మకూరు' కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తరలివెళ్లారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, దేవినేని అవినాష్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా తెదేపా కార్యకర్తలతో కలిసి రోడ్డుపైన బైఠాయించి అవినాష్ ఆందోళనకు దిగారు. దీంతో అవినాష్‌ని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దేవినేని అవినాష్ అరెస్ట్
.
Last Updated : Sep 11, 2019, 10:10 AM IST
TAGGED:
avinash