తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో (KBR park in Hyderabad) నటి షాలూ చౌరాసియాపై (attack on actress chaurasia) దాడి జరిగింది. నడకకు వెళ్లిన ఆమెపై ఓ దుండగుడు దాడి (attack on heroine) చేసి చరవాణి లాక్కెళ్లాడు.
రాత్రి 8.30 గంటల సమయంలో షాలూ.. కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు (night walk at KBR park) వెళ్లారు. అక్కడికి అకస్మాత్తుగా వచ్చిన ఓ ఆంగతుకుడు.. ఆమె వద్ద ఉన్న నగలు, నగదు ఇవ్వాలని బెదిరించాడు. ఆమె ఇవ్వకపోవడంతో మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆగంతుకుడితో పెనుగులాడే క్రమంలో అతడు బండరాయితో దాడి చేయడం(attack on shalu chourasia) వల్ల ఆమె తల, కళ్లకు గాయాలయ్యాయి. అతణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అక్కణ్నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వెతికినా కనిపించకపోయేసరికి షాలూ చౌరాసియా డయల్ 100కు సమాచారం అందించారు.