ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Assembly Session: ఆరో తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - తెలంగాణ అసెంబ్లీ

Assembly session: ఈ నెల ఆరో తేదీ నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదేరోజు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బీఏసీ భేటీ నిర్ణయించనుంది.

assembly
assembly

By

Published : Sep 2, 2022, 5:56 PM IST

Assembly sessions: ఈనెల 6 నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయసభల సమావేశాలు ప్రారంభమవుతాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలు, ఇటీవల వరదలపై సభలో చర్చ జరిగే అవకాశముంది.

సెప్టెంబర్ 3న కేబినెట్ భేటీ: సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్​లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతిభవన్​లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాసనసభ సమావేశాల నిర్వహణపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్​లో చర్చించి తేదీలు ఖరారు చేస్తారు. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details