ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 8న బీఏసీ మీటింగ్​ - బీఏసీ సమావేశం న్యూస్

ఈ నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలపై 8వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు బీఏసీ సమావేశం జరగనుందని స్పీకర్ కార్యాలయం తెలిపింది. సభలో పెట్టే బిల్లులపై చర్చించేందుకు 11వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

Assembly session BAC meet on 8th
ఈ నెల 8న బీఏసీ సమావేశం

By

Published : Dec 6, 2019, 5:10 PM IST


శాసనసభ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. సభ ముందుంచే అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో స్పీకర్ నిర్వహించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాన్ని 8వ తేదీ సాయంత్రం నిర్వహించనున్నారు. స్పీకర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు బీఏసీ సమావేశం జరుగనుంది. శాసనసభ నిర్వహణకు సంబంధించిన అంశాలను బీఏసీ ఆ సమావేశంలో చర్చించనుంది. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 11వ తేదీన కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్​లో 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. మద్య నిషేధ కార్యక్రమానికి సంబంధించి అదనపు రిటైల్ పన్ను విధింపు, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం తదితర అంశాలపై కేబినెట్​లో చర్చించి శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details