ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుంచె నుంచి జాలువారాయి.. మదిని దోచుకున్నాయి!

హైదరాబాద్​లోని వెంగళ్​​రావు నగర్​ డివిజన్​లో ఏర్పాటు చేసిన కళాత్మక చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. నిజ జీవిత సంఘటనలు ప్రతిబింబించేలా.. చిత్రకారులు తమ కుంచెతో బొమ్మలు చిత్రించారు. ఈ- డైమెన్షన్​ సీజన్​ సిక్స్​ ఆర్ట్స్​ కళాశాల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

By

Published : Feb 21, 2021, 8:46 PM IST

Published : Feb 21, 2021, 8:46 PM IST

కుంచె నుంచి జాలువారాయి.. మదిని దోచుకున్నాయి.!
కుంచె నుంచి జాలువారాయి.. మదిని దోచుకున్నాయి.!

కుంచె నుంచి జాలువారాయి.. మదిని దోచుకున్నాయి.!

'కళాకారులు తమ కలలను అందమైన రూపంలో గుర్తించడం ఒక కళ' అని లయన్స్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు కృష్ణమూర్తి అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్​లోని వెంగళ్​ రావు నగర్ డివిజన్ మధురా నగర్​లో ఈ- డైమన్షన్ సీజన్ సిక్స్ ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో సంజయ్ కుమార్.. కళాత్మక చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్రకారులు వేసిన బొమ్మలను తిలకించి వారి ప్రతిభను అభినందించారు. విభిన్న దృక్పథాలతో వేసిన కళాఖండాలు ఆకట్టుకున్నాయి. కళాకారులు జయరాజు, మోహన్ రాజు, ప్రసన్న, మురళి వేసిన చిత్రాలను ప్రదర్శించారు.

చిత్రకారులు వారి భావాలను చిత్రీకరించిన ఒక గొప్ప అనుభూతి కలిగిందని కృష్ణమూర్తి పేర్కొన్నారు. కళాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంజయ్​ కుమార్​ వెల్లడించారు. మార్చి నుంచి బెంగళూరులో ఏర్పాటు చేసే ఆర్ట్ ఎగ్జిబిషన్లలో మరిన్ని చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కళాత్మక నైపుణ్యం కలిగిన వారిని గుర్తించడమే తమ లక్ష్యమని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details