ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐటీ సేవల్లో... ఏపీఎస్ఆర్టీసీకి దేశంలో ప్రథమ స్థానం - ఐటీ ఇన్ డిజటలైజేషన్ ఎక్సలెన్స్ అవార్డు పోటీలు

ఐటీ సేవల్లో ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. దేశంలోని 64 ఆర్టీసీలను దాటుకుని ప్రథమ స్థానం సాధించింది. తద్వారా మన ఆర్టీసీ దేశవ్యాప్త గుర్తింపు సాధించింది

APSRTC WON FIRST PRIZE IN IT in digitalization exellence
APSRTC WON FIRST PRIZE IN IT in digitalization exellence

By

Published : Feb 1, 2020, 6:59 AM IST

అవార్డును అందుకుంటున్న ఆర్టీసీ ఈడీ ఏ.కోటేశ్వరరావు

సాంకేతికతను వినియోగించి ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో ఎపీఎస్ఆ​ర్టీసీ మరోసారి సత్తా చాటింది. ఐటీ ఆధారిత సేవల్లో ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఆర్టీసీ... దేశంలోనే తొలి స్థానంలో నిలిచి ప్రత్యేకత చాటింది. ఏఎస్​ఆర్టీయూ నిర్వహించిన ఐటీ ఇన్ డిజటలైజేషన్ ఎక్సలెన్స్ అవార్డు పోటీల్లో విజేతగా నిలిచింది. దేశంలో 64 ఆర్టీసీలు ఉండగా.. వీటన్నింటినీ దాటుకుని ఐటీ ఆధారిత సేవల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా మన ఆర్టీసీ దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. ఐటీ ఆధారంగా ఆన్​లైన్ ద్వారా టికెట్ల బుకింగ్, బస్సు రాకపోకల కచ్చిత సమయవేళలను తెలియజేసేందుకు ఎపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ సహా ఇతరత్రా మొబైల్ యాప్​లతో సాంకేతిక సేవలు అందిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ప్రయాణికుల మన్ననలు అందుకుంటూ సత్తా చాటింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ ఏ.కోటేశ్వరరావు అవార్డును అందుకున్నారు. అవార్డుతో పాటు 10 లక్షల నగదు బహుమతిని అందుకున్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details