ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APSRTC: అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు.. ప్రకటన విడుదల

APSRTC: రాష్ట్రంలో మరో 263 అద్దె ఆర్టీసీ బస్సులు రోడ్జెక్కనున్నాయి. జిల్లాల వారిగా కావాల్సిన అద్దె బస్సుల కోసం టెండర్లు దాఖలు చేసుకునేెందుకు ప్రకటన జారీ చేసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 22, 2022, 10:44 PM IST

APSRTC Tender Notification: ఎపీయస్ఆర్టీసీలో అద్దె బస్సులు క్రమంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ నాటికి వెయ్యి అద్దెబస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం.. దశలవారీగా రోడ్డెక్కించే చర్యలు తీసుకుంటోంది. మరో 263 అద్దెబస్సులు ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంది. జిల్లాల వారీగా కావాల్సిన అద్దె బస్సులకు టెండర్లు దాఖలు చేసేందుకు ప్రకటన జారీ చేసింది.

అద్దె ప్రాతిపాదికన నడపనున్న బస్సులు:4 స్లీపర్, 6 నాన్ ఎసీ స్లీపర్, 12 సూపర్ లగ్జరీ, 15 ఆల్ట్రాడీలక్స్ బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. 30 ఎక్స్​ప్రెస్, 95 అల్ట్రా పల్లెవెలుగు, 72 పల్లెవెలుగు బస్సులు, 27 మెట్రో ఎక్స్​ప్రెస్, 2 సిటీ ఆర్డినరీ బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించనుంది.

అద్దె బస్సులు నడిపేందుకు ఆసక్తి కలవారు ఎంఎస్​టీసీ ఈ కామర్స్ పోర్టల్​లో టెండర్లు దాఖలు చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల 23 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 10 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details