సీనియర్ ఐఏఎస్ అధికారి బాబు.ఎ ను పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఎండీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత సెలవుతో పాటు శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నూతనంగా ఏర్పాటు అయిన అమూల్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగానూ బాబు.ఎకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే కడప జిల్లా పులివెందులలో ఉన్న ఏపీ లైవ్ స్టాక్ రీసెర్చి కేంద్రం సీఈఓగానూ పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.