రాష్ట్రంలో మరో 4 - 5 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలిక అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ శాఖ సూచించింది.
నేడు రాష్ట్రంలో భారీ వర్షం ..! - ap weather updates
రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
weather updates
Last Updated : Nov 12, 2020, 12:20 PM IST