ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు@9am - 9ఏఎం టాప్​ న్యూస్​

.

9am topnews
ప్రధానవార్తలు@9am

By

Published : Sep 21, 2022, 9:03 AM IST

  • చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు సజీవదహనం

చిత్తూరు రంగాచారి వీధిలోని పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి పరిశ్రమలో మంటలు చెలరేగి.. ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో పరిశ్రమ యజమాని భాస్కర్‌, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు, బాలాజీ అనే మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు.

  • Investment proposals: పాత పెట్టుబడులకు కొత్త ప్రకటనలు..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకుల కృషితో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు అంతంతమాత్రమే. ఇందుకు అస్థిర విధానాలు, పెట్టుబడిదారులను తరిమికొట్టడం, పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాజధాని అమరావతి విధ్వంసానికి పాల్పడటమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడో వచ్చిన పరిశ్రమల్ని ఇప్పుడు చూపిస్తూ.. పెట్టుబడుల్ని ఆకర్షించడంలో దేశంలోనే ఏపీ అగ్రగామి అని ప్రకటనలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

  • కేసులకు భయపడం.. జగన్​ నేరచరిత్రపై పోరాటం: చంద్రబాబు

కేసులకు భయపడే ప్రసక్తే లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు జైలులో ఉన్న తెదేపా నేతలను పరామర్శించిన తర్వాత మాట్లాడిన ఆయన.. జగన్‌ నేరచరిత్రపై పోరాటం చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే పోలీసు అధికారులను.. వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

  • ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పు.. కేబినెట్​ ఆమోదం

రాష్ట్రంలో ఎంతో కీలకమైన విజయవాడలోని ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్​ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేస్తూ నేడు ఆసెంబ్లీలో ప్రభుత్వం సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. అప్పట్లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీల అందజేసేవారు.

  • కునోకు వచ్చిన చీతాలు క్షేమమేనా..? నిపుణుల నిఘా

నమీబియా నుంచి కునో నేషనల్​ పార్క్​కు కొత్త స్నేహితులు వచ్చాయి. అంత దూరం నుంచి వచ్చిన ఈ అతిథులకు ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడ్డాయో లేదో తెలియదు. అందుకనే వాటి ఆలనా పాలన చూసుకునేందుకు నిపుణులు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తున్నారు.

  • గుజరాత్‌లో కేజ్రీవాల్​కు చేదు అనుభవం.. కావాలనే చేయించారని దిల్లీ సీఎం ఫైర్

గుజరాత్ పర్యటనలో ఆప్ అధినేత కేజ్రీవాల్​కు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్​పోర్టు నుంచి బయటకు రాగానే కొందరు వ్యక్తులు ఆయన ముందే 'మోదీ.. మోదీ..' అంటూ నినాదాలు చేశారు. దీనిపై కేజ్రీవాల్ మండిపడ్డారు.

  • అమ్మ బాబోయ్​! భూమిపై ఇన్ని చీమలున్నాయా?

ఈ భూగోళంపై నివసిస్తున్న మానవుల కంటే చీమల సంఖ్యే ఎక్కువని అందరికీ తెలిసిందే. కానీ వాటి సంఖ్య లెక్కకట్టడం అంత తేలికైన విషయం కాదు. కానీ హాంకాంగ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ సాహసానికి పూనుకున్నారు. ఎట్టకేలకు భూమిపైన ఉన్న చీమల సంఖ్యను కనుక్కున్నారు.

  • డిజిటల్​ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి : ప్రధాని మోదీ

డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్‌) రంగం నిరంతరాయంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే అద్భుతాలకు ఉదాహరణగా ఈ రంగం నిలుస్తుందని గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ (జీఎఫ్‌ఎఫ్‌) సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

  • టీమ్ ఇండియా అభిమానికి సారీ చెప్పిన వార్నర్​.. ఎందుకంటే?

మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భాగంగా మొదటి భారత్​-ఆసీస్​ టీ20 మొహాలీ వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్​ హిట్టర్ డేవిడ్​ వార్నర్.. ఓ టీమ్ ఇండియా అభిమానికి సారీ చెప్పాడు. ఈ విషయం నెట్టింట వైరల్ మారింది.

  • 'గిరి గీసుకొని ఉంటానంటే ఎలా?.. ఈ 'అల్లూరి' వందలో ఒక్కడు'

టాాలీవుడ్ యువ నటుడు శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎప్పుడూ కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకునే శ్రీవిష్ణు.. ఈసారి ఖాకీ చొక్కా వేసుకుని ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. సెప్టెంబర్​ 23న విడుదయ్యే 'అల్లూరి' చిత్ర విశేషాలు విలేకర్లతో పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details