- AMMA VODI FUNDS: వెబ్‌సైట్‌లో పడినట్లు.. కానీ ఖాతాల్లో లేనట్లు.. ఎవరి ఖాతాలో పడ్డాయో..!
విజయవాడలోని వాంబేకాలనీకి చెందిన మధు అనే మహిళకు అమ్మఒడి డబ్బులు పడినట్టుగా వెబ్‌సైట్‌లో ఉంది. తీద్దామని చూస్తే ఖాతాలో కనిపించడం లేదు. దీంతో మరోసారి వెబ్‌సైట్‌లో చూసుకోగా.. విద్యార్థి, అతని తల్లిపేరు వివరాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. కానీ.. బ్యాంకు ఖాతా మాత్రం వేరే ఎవరిదో పక్కన కనిపిస్తోంది. ఆ బ్యాంకు ఖాతా తనది కాదంటూ గత మూడు వారాలుగా ఆ తల్లి సచివాలయం చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AP PHC: ప్రాథమిక వైద్యానికి సర్దుబాటు గండం..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్య సిబ్బంది కుదింపు చర్యలు ఆందోళనలకు దారితీస్తున్నాయి. పీహెచ్‌సీల్లో సిబ్బంది సంఖ్య 21 నుంచి 12కు కుదించే యత్నాలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. రోగులకు చికిత్స, జాతీయ కార్యక్రమాల పర్యవేక్షణపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఆరోగ్యసేవల విషయంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- VOTER CARD AADHAR LINK: ఓటర్ల జాబితాతో ఆధార్ అనుసంధానం... వివరాల సమర్పణ స్వచ్ఛందమే..
ఓటర్ల జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఆగస్టు ఒకటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అయితే ఇందులో వివరాల సమర్పణ అనేది పూర్తిగా స్వచ్ఛందమేనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పారదర్శకత అంటేనే గిట్టని పాలకులు.. పోర్టల్‌లో కనిపించని మెజారిటీ జీవోలు !..
పారదర్శకత అంటేనే గిట్టనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన పాలకులు.. గోప్యతకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మెజారిటీ జీవోల సమాచారం ఎవరికీ కనిపించడం లేదు. ఇ-గెజిట్ పోర్టల్‌లోనూ అరకొరగానే జీవోలు దర్శనమిస్తున్నాయి. హైకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా.. ప్రభుత్వ పోకడలో మార్పురావడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంకీపాక్స్‌పై కేంద్రం అప్రమత్తం.. రంగంలోకి టాస్క్‌ఫోర్స్..
దేశంలో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వ్యాధి కట్టడికి గాను ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు చేయడం, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలు చేస్తుందని తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రైల్లో అర్ధరాత్రి పాము హల్చల్.. బెంబేలెత్తిన ప్రయాణికులు.. ట్రైన్‌ను నిలిపివేసినా..
కేరళ కోజీకోడ్ రైల్వే స్టేషన్లో పాము కలకలం సృష్టించింది. తిరువనంతపురం- నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం రాత్రి పాము కనిపించింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. సమాచారం అందుకున్న టీటీఈ.. పాముల పట్టేవారితో వెతికించినా అది కనిపించలేదు. కాసేపటి తర్వాత రైలు బయల్దేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఇకపై ఎలాంటి పాత్రైనా చేస్తా.. అందుకే రవితేజ సినిమా ఒప్పుకున్నా'..
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత 'రామారావు ఆన్ డ్యూటీ'తో తెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి. దీన్ని శరత్ మండవ తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలు పంచుకున్నారు వేణు. ఆ సంగతులివీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీ20 సమరానికి టీమ్‌ఇండియా రెడీ.. విండీస్ అదరగొట్టేనా?..
ప్రమాదకర ఆటగాళ్లతో నిండిన వెస్టిండీస్‌ను దాని సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో మట్టికరిపించిన ఉత్సాహంతో ఉంది టీమ్‌ఇండియా. తొలి రెండు వన్డేలతో పోలిస్తే మూడో మ్యాచ్‌లో సులువుగా, ఘనంగా గెలిచిన భారత్.. ఇప్పుడిక టీ20 పోరుకు సిద్ధమైంది. ఫార్మాట్ మార్పుతో పాటే జట్టు మారుతోంది. కెప్టెన్ మారుతున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బంగారానికి గిరాకీ తగ్గొచ్చు'.. ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త..!
ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో దేశీయంగా బంగారానికి గిరాకీ తగ్గే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణమండలి అంచనా వేసింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం, దిగుమతి సుంకాల పెంపు వల్ల బంగారం గిరాకీ తగ్గే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తగ్గిన జీడీపీ వృద్ధి.. ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా?..
అమెరికా తాజాగా విడుదల చేసిన త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటు తగ్గుదల నమోదు చేసింది. దీంతో ఆర్థిక మాంద్యంలో పడే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.