- హామీలు ఇచ్చి అమలు మరిచిన జగనన్న..
సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఆర్టీసీ ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్ వరాల జల్లు కురిపించారు. 2020 జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రభుత్వంలో విలీనం అనగానే ఎగిరి గంతేశారు. సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇవ్వగానే సంబరపడిపోయారు. జీతాల పెంపు కోసం ఆశగా ఎదురుచూశారు. కాలం గడుస్తున్నా ఇప్పటికీ విలీన ఫలాలు ఆర్టీసీ ఉద్యోగులకు దక్కలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉద్యోగాల పేరిట మోసం!
కళాశాల క్యాంపస్‌లోనే ఇంటర్వ్యూ చేశారు. అందులో కొందరిని ఎంపిక చేసి.. ఉద్యోగానికి ఎంపికైనట్లు లేఖలు పంపించారు. మూడు నెలల తర్ఫీదు ఉంటుందని ఆ తర్వాత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా రూ.50 వేలపైన చెల్లించాలని సూచించారు. అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో నెలకు రూ.10వేలు చెల్లిస్తారని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పపై డీఐజీకి ఫిర్యాదు చేస్తా'
అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పపై డీఐజీకి ఫిర్యాదు చేస్తానని.. ఉద్యోగం నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు. అలాగే కోర్టుకు కూడా వెళతానన్నారు. ఎస్పీ ఫక్కీరప్పతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు విచారణకు ప్రకాశ్ హాజరయ్యారు. ఎస్పీ ఫక్కీరప్పతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కేసు విచారిస్తున్న పలమనేరు డీఎస్పీ గంగయ్యను అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రామ సచివాలయంలో రెచ్చిపోయిన యువకుడు..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల సచివాలయంలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. సచివాలయంలో రెండు కంప్యూటర్లు, ప్రింటర్లను ధ్వంసం చేశాడు. సిబ్బందిపై దౌర్జన్యం చేయడమే కాక తిరిగి వారిపై ఫిర్యాదు చేసేందుకు ముప్పాళ్ల పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో పెరిగిన కొవిడ్ కేసులు.. 27 మంది మృతి..
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,379 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7కు పెరిగింది. యాక్టివ్ కేసులు 0.11 శాతానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అకస్మాత్తుగా రోగికి గుండెపోటు.. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన డాక్టర్..