- Nellore Theft Case: కోర్టు దొంగతనం కేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్
ఇటీవల నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం కేసులో పురోగతి లభించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విజయారావు వెల్లడించారు. నిందితుల నుంచి ట్యాబ్, ల్యాప్‌ట్యాప్, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- TDP Protest: 'పల్లెవెలుగు'లో ఛార్జీలు రెండింతలు పెంచడం దారుణం: తెదేపా
రాష్ట్రంలో పన్నులు, అధిక ధరల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం మండిపడింది. జగన్ ప్రభుత్వం ప్రజలపై పెంచుతున్న భారాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తాజాగా బాపట్ల జిల్లాలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ర్యాలీ నిర్వహించగా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు సారథ్యంలో సైకిల్ యాత్ర చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- Accident: అనంత జిల్లాలో వాహనంపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురికి తీవ్రగాయాలు
అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. లారీ అతివేగంగా దూసుకొచ్చి.. తూఫాను వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరోవైపు క్షతగాత్రులను 108 వాహనంలోకి గుంతకల్లు ఆస్పత్రికి తరలించినా అరగంట వరకు చికిత్స అందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- నెల్లూరులో తాజా, మాజీ మంత్రుల సభ.. రంగంలోకి దిగిన అధిష్టానం
నెల్లూరులో టెన్షన్ వాతావరణానికి తెర దించేందుకు అధిష్టానం రంంలోకి దిగింది. మంత్రి కాకాణి, మాజీ మంత్రి సభల నేపథ్యంలో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరువురు నేతలు సభలు నిర్వహించుకున్నా... పరస్పర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఈరోజు ఇరువురు నేతల వేర్వేరు సభల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కుట్ర ప్రకారమే శోభా యాత్ర వేళ ఘర్షణలు.. పోలీసులు అలర్ట్'
హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు దిల్లీ పోలీసులు. శనివారం జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 14 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో కూడా శనివారం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- భార్యపై కోపం.. మరో ఇద్దరిని పిలిపించి గ్యాంగ్ రేప్
భార్యపై కోపంతో దారుణానికి తెగించాడో వ్యక్తి. మరో ఇద్దరిని పిలిపించి.. ఆమెపై సామూహిక అత్యాచారం చేసేలా ప్రోత్సహించాడు. ఆ ఇద్దరూ.. భర్త కళ్లెదుటే ఆ మహిళపై అఘాయిత్యం చేశారు. ఈ భయానక ఘటన మహారాష్ట్ర ఔసాలోని సారోలా ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అఫ్గాన్‌పై పాక్ వాయుదాడులు.. 40 మంది మృతి
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 40 మందికిపైగా మృతిచెందారు. పాక్ వైఖరిని ఖండిస్తున్నట్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 5 శాతం జీఎస్టీ శ్లాబు ఎత్తివేత? ఇక పన్నుల బాదుడే !
జీఎస్టీ మండలి పలు మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మే నెలలో జరగనున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముఖ్యంగా 5 శాతం పన్ను శ్లాబును ఎత్తేయనున్నట్లు సమాచారం. దీనిని.. 7, 8 లేదా 9 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- పాన్ ఇండియా హీరోగా నిఖిల్.. రామ్ కోసం శింబు.. ఓటీటీలో 'గని'
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో వరుణ్‌తేజ్, నిఖిల్ పాన్ఇండియా మూవీ, రామ్పోతినేని, శింబు చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- బరువు తగ్గడానికెళ్లి.. ప్రపంచ ఛాంపియన్ అయ్యింది!
వివాహమై ఆమె ఓ బిడ్డకు తల్లైంది. ప్రసవం తర్వాత పెరిగిన అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లో చేరింది. అదే ఆమెను అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా మార్చింది. కెటిల్‌బెల్ క్రీడలో స్వర్ణపతకాన్ని సాధించిన తొలి మహిళగా, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ ప్రధాన వార్తలు