ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఆంధ్రప్రదేశ్ టాప్ న్యూస్

.

ap top news
ap top news

By

Published : Nov 3, 2020, 5:00 PM IST

  • చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా..ముగ్గురు మృతి
    చిత్తూరు జిల్లా మదనపల్లె జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 17 మందికి గాయాలు అయ్యాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ప్రజా సమస్యలపై తెదేపా పోరుబాట
    రాష్ట్రంలో ప్రజా సమస్యలపై తెలుగు దేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. పలు జిల్లాల్లో ఉన్న ప్రజల సమస్యలపై ధర్నాలు నిర్వహించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • తెలంగాణ: రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి
    ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి కప్పర్ల రెవెన్యూ అధికారి రోహిత్​పై మహిళా రైతులు దాడి చేశారు. భూ ప్రక్షాళనలో తమ భూమి తక్కువ నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఆన్​లైన్​ జూదం నిషేధం కేసులో ప్రముఖులకు నోటీసులు
    ఆన్‌లైన్‌ జూదం నిషేధం కేసుపై తమిళనాడులోని మదురై బెంచ్‌ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా క్రీడా, సినీ ప్రముఖులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • భారతీయ రైల్వే ఆదాయంలో భారీ క్షీణత
    ప్యాసింజర్​ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల భారతీయ రైల్వే ఆదాయం భారీగా క్షీణించింది. గతేడాదితో పోల్చితే 90శాతం తగ్గి.. రూ. 3,322కోట్లను ఆర్జించింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దిల్లీలో చలి జోరు- వాయు నాణ్యత బేజారు
    దిల్లీలో ఉష్ణోగ్రత ఈ సీజన్​లోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మంగళవారం 10 డిగ్రీల సెల్సియస్​కు తగ్గింది. హిమాచల్​లోని శీతల ప్రాంతాలతో పోలిస్తే రాజధానిలోనే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'కేబీసీ'పై వ్యతిరేకత.. అమితాబ్​పై​ కేసు నమోదు
    బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న'కౌన్​ బనేగా కరోడ్​పతి'పై సోషల్​మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ట్రంప్ ​X బైడెన్​: గెలిచేదెవరో తేలేది కోర్టులోనే!
    అగ్రరాజ్యానికి అధిపతిని ఎన్నుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి. ఈసారి రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​, డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​ మధ్య పోరు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'ఓ ఘట్టం ముగిసింది.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'
    ఆస్ట్రేలియా క్రికెటర్​ షేన్​ వాట్సన్​ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. తన కలను సాకారం చేయడానికి సాయపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్​ చేశాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • కంగనా సిస్టర్స్​కు మరోసారి సమన్లు
    బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్​, ఆమె సోదరికి మరోసారి సమన్లు జారీ చేశారు ముంబయి పోలీసులు. వచ్చే వారంలో వారు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details