తెలంగాణ ప్రాజెక్టులపై రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య స్పందించింది. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని సమాఖ్య అధ్యక్షుడు గోపాలకృష్ణారావు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు.
తక్షణమే ఈ విషయంలో స్పందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను కాపాడాలని కోరారు. ఈ విషయమై.. ఈ - మెయిల్ ద్వారా కేంద్ర మంత్రికి వినతిపత్రం పంపారు.