మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్
16:42 February 06
.
కొవిడ్ దృష్ట్యా నాలుగు దశల్లో జరిగే పంచాయితీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని గణనీయంగా పెంచుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో జరిగే పోలింగ్ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె. కన్నబాబు స్పష్టం చేశారు.
కొవిడ్ దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే చర్యలు చేపట్టినట్లు కన్నబాబు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలింగ్ ముగించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ సమయం గురించి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: మూడో దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం