ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Treason cases in AP రాజద్రోహం కేసుల్లో ఏపీనే ప్రథమం, అంతకుముందు ఏడేళ్లలో

Treason cases in AP బ్రిటీష్‌వాళ్లు స్వాతంత్య్ర సమరయోధులపై ప్రయోగించిన రాజద్రోహం కేసును వైకాపా ప్రభుత్వం ఇప్పుడు రికార్డ్‌ స్థాయిలో వినియోగిస్తోంది. గతేడాది దేశంలోనే అత్యధిక రాజద్రోహం కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. అంతకుముందు ఏడేళ్లలో ఏపీలో మూడంటే మూడు రాజద్రోహం కేసులు నమోదవగా గతేడాది ఏకంగా 29 కేసులు నమోదయ్యాయి. వైకాపా ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల్నిఅణచివేస్తోందనడానికి ఇదే నిదర్శనమని న్యాయనిపుణులు మండిపడుతున్నారు.

Treason cases in AP
రాజద్రోహం కేసుల్లో ఏపీ

By

Published : Aug 30, 2022, 8:43 AM IST

Treason cases in AP ప్రభుత్వ, పాలకుల వైఫల్యాలను నిలదీసే, ప్రశ్నించే వారిని అణచివేయడమే లక్ష్యంగా నమోదవుతున్న రాజద్రోహం (ఐపీసీలోని సెక్షన్‌ 124ఏ) కేసులపై సుప్రీంకోర్టు ధర్మాసం ఆదేశాలను బట్టి అది ఎంతటి వివాదాస్పద అంశమో అర్థమవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రజాగొంతుకలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం విచక్షణారహితంగా రాజద్రోహం కేసులు పెడుతోంది. పాలనా వైఫల్యాలు, విధానాల్లోని లోపాలపై విమర్శలు చేసేవారితో పాటు రాజకీయంగా గిట్టని వారిపైనా ఇవే కేసులు పెట్టింది.

‘బ్రిటిష్‌ పాలకులు అమల్లోకి తెచ్చిన ఐపీసీలోని సెక్షన్‌ 124ఏ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదు. దాన్ని పునఃపరిశీలించాలి. ఒకవైపు రాజ్యం విధులు, మరోవైపు పౌరహక్కులు.. ఈ రెండింటినీ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. వీటి మధ్య సమతుల్యత పాటించాలి.’ - సుప్రీంకోర్టు

‘రాజద్రోహ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకునేదాకా దాని అమలును నిలిపేస్తున్నాం. రాజద్రోహానికి సంబంధించిన 124ఏ సెక్షన్‌ కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు. ఇప్పటికే దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లపై చర్యలు తీసుకోవద్దు. అరెస్టై జైళ్లల్లో ఉన్నవారు కోర్టుల ద్వారా బెయిలు పొందొచ్చు. ఈ కేసుల్లో పెండింగ్‌ విచారణలు, అప్పీళ్లు, అభియోగాల నమోదు నిలిపేయాలి. కొత్త కేసుల నమోదులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలి.’ - ఈ ఏడాది మే 11న సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు

దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలో ఒక్క ఏడాదిలోనే ఈ అభియోగంతో 29 కేసులు నమోదు చేసింది. 124ఏ కింద 2021లో దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీది అగ్రస్థానం. దేశవ్యాప్తంగా 76 కేసులు నమోదైతే.. అందులో 38.15 శాతం ఏపీలోనే. ఆ తర్వాతి స్థానంలో ఉన్న మణిపుర్‌, నాగాలాండ్‌లలో ఏడేసి కేసులున్నాయి. ఏపీతో పోల్చితే పెద్ద రాష్ట్రాలైన గుజరాత్‌, బిహార్‌, తమిళనాడు, కర్ణాటకల్లో ఒక్క కేసూ లేదు. పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడు కేసులే కాగా, ఏపీలో అంతకు దాదాపు పదింతలు ఉండటం గమనార్హం.

ఉగ్రవాదుల కార్యకలాపాలతో నిత్యం కల్లోలంగా ఉండే జమ్మూ, కశ్మీర్‌లోనూ రాజద్రోహం కేసులు రెండే. దీన్నిబట్టి 124ఏ సెక్షన్‌ను వైకాపా ప్రభుత్వం ఎంత విచక్షణారహితంగా వినియోగించిందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ నేర గణాంక సంస్థ 2021 సంవత్సరానికి తాజాగా విడుదల చేసిన వార్షిక నేర నివేదికలో ఈ అంశాలు వెలుగుచూశాయి. వీటిల్లో ఎక్కువ శాతం రాజకీయ ప్రత్యర్థులపై నమోదు చేసినవేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇవీ గణాంకాలు

* ఆంధ్రప్రదేశ్‌లో 2014-20 మధ్య ఏడేళ్లలో మూడు రాజద్రోహం కేసులు నమోదుకాగా, వాటిలో రెండు మావోయిస్టులు, వారి సానుభూతిపరులపై పెట్టారు.

* 2015, 17, 19, 20 సంవత్సరాల్లో ఎవరిపైనా ఈ కేసు పెట్టలేదు. 2014, 16, 18లలో ఒక్కోటి చొప్పున నమోదయ్యాయి. 2021లో ఏకంగా 29 కేసులు పెట్టారు.

* సీఐడీ పోలీసులు ఎక్కువగా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు ఏబీఎన్‌, టీవీ5 ఛానళ్లపైనా ఇవే అభియోగాలు మోపారు.

* భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా, ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని బెదిరించేలా 124ఎ సెక్షన్‌ను వాడుకుంటున్నారు. స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయడానికి బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన ఈ చట్టాన్ని ప్రజాగొంతుకలపై ప్రయోగించడం వల్లే కేసుల సంఖ్య భారీగా పెరిగినట్లు నేర గణాంక నివేదిక చెబుతోంది.

రాజద్రోహం కేసుల్లో ఏపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details