ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల పిటిషన్​పై విచారణ వాయిదా - ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్ వార్తలు

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎస్​ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్​ను కోర్టు రికార్డుల్లోకి ఎక్కించాలని రిజిస్ట్రార్​ను ఆదేశించింది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్​ ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. వచ్చే మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

Ap high court
Ap high court

By

Published : Nov 9, 2020, 5:52 PM IST

పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఎస్​ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను కోర్టు రికార్డులోకి ఎక్కించాలని రిజిస్ట్రార్​ను హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్​లో ఉందని కోర్టుకు తెలిపిన ఏజీ... వచ్చే మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. నిర్ణయం వచ్చే వరకు సమయం ఇవ్వాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details