ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 19, 2021, 3:49 PM IST

ETV Bharat / city

'ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో.. ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ విచారణ జరపవద్దు'

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి.. ఫాం - 10 ఇచ్చిన ఏకగ్రీవాలపై విచారణ జరపవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇవ్వకుంటే ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది.

ap MPTC, ZPTC elections latest news
ap MPTC, ZPTC elections latest news

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్‌ఈసీకి లేదని పలువురు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఏకగ్రీవాలు అయిన స్థానాలకు డిక్లరేషన్​కు సంబంధించి.. ఫాం-10 ఇచ్చి ఉంటే.. ఎస్‌ఈసీ విచారణ జరపవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇవ్వకుంటే విచారణ జరిపిన తర్వాత... ఫలితాలు వెల్లడించవద్దని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details