ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 560 వైఎస్​ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు - వైఎస్​ఆర్ అర్బన్ క్లినిక్​ల వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో వైఎస్​ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం 560 కేంద్రాల ఏర్పాటునుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కొత్త భవనం నిర్మాణానికి ఒక్కో కేంద్రానికి 80 లక్షలు అంచనా వ్యయంగా నిర్ణయించింది.

ysr urban primary health centres
ysr urban primary health centres

By

Published : Nov 10, 2020, 2:11 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వైఎస్​ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 560 క్లినిక్​ల ఏర్పాటునకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పట్టణాల్లో ఇప్పటికే ఉన్న 331 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడంతో పాటు... కొత్తగా 229 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అదనంగా 355 కేంద్రాలకు భవనాలు నిర్మించాలని నిర్ణయించారు.

ఒక్కో కేంద్రానికి 80 లక్షల వ్యయం..

కొత్త భవనం నిర్మాణానికి ఒక్కో కేంద్రానికి 80 లక్షలు అంచనా వ్యయంగా నిర్ణయించారు. 355 కేంద్రాలకు కలిపి 284 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రస్తుతం ఉన్న 205 భవనాలకు మరమ్మతులు సహా అభివృద్ధి అవసరమని భావించి ఒక్కో కేంద్రానికి 10 లక్షలు చొప్పున మొత్తం 20.50 కోట్లు కేటాయించారు. మొత్తం 560 కేంద్రాల్లో ఫర్నీచర్ కోసం ఒక్కో కేంద్రానికి 20 లక్షల చొప్పున కేటాయించారు. అన్నింటికీ కలిపి మొత్తం 416.50 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామకం

వీటితో పాటు ఈ కేంద్రాల్లో పనిచేసేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. 560 కాంట్రాక్ట్ మెడికల్ అధికారులు, 1120 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, 560 ల్యాబ్ టెక్నీషియన్లు , అవుట్ సోర్సింగ్ పై 560 డీఈవో పోస్టులు, 560 ఎల్ జీ ఎస్ ఉద్యోగాలు అవసరమవుతాయని లెక్కలేసింది. వీటి కోసం ఏడాదికి 112.11 కోట్లు ఖర్చు అవుతాయని నిర్ణయించి... ఖర్చు చేసేందుకు అనుమతించింది. వీటి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం శాఖ కమిషనర్​ను ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చదవండి

'ఫిబ్రవరికి నాడు-నేడు తొలి దశ పనులు పూర్తవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details