నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు అంతర్జాతీయ టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రయాణికులు, కార్గో విమానాలు నిర్వహించేందుకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేలా ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకుగానూ ఈ టెండర్లను పిలిచారు. ఆసక్తి ఉన్న సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఇన్ క్యాప్ సంస్థ నోటిఫికేషన్లో పేర్కోంది. నాలుగు నెలల్లోపు ఈ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొదించాల్సిందిగా గడువు విధించింది. 1350 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది.
దగదర్తి విమానాశ్రయ డీపీఆర్ కోసం టెండర్లు ఆహ్వానం
నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు అంతర్జాతీయ టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. 4 నెలల్లోపు డీపీఆర్ రూపొదించాల్సిందిగా టెండరు నోటిఫికేషన్లో గడువు విధించింది.
dagadarthi airport in nellore district