వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద ప్రభుత్వం మరో 4.30 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. పింఛన్లు పొందుతూ గత డిసెంబరుల్లో నిర్వహించిన నవశకం సర్వే ద్వారా అనర్హుల జాబితాలో చేరిన 4.69లక్షల మంది వివరాలను ప్రభుత్వం రీసర్వే చేయించింది. వారిలో 3,03,536 మంది అర్హులేనని తాజాగా తేల్చింది. వీరికి ఫిబ్రవరి నెలలో పింఛను ఇవ్వలేదు. మార్చి నెలలో రెండు నెలల మొత్తాన్ని ఒకే సారి ఇస్తారు. కొత్తగా వివిధ రకాల పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న మరో 1.27లక్షల మందికి మార్చి నెలలో పింఛన్లు అందించనున్నారు.
3 లక్షల మందికి మళ్లీ పింఛన్లు - AP government's key decision pensions news
పింఛన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద ప్రభుత్వం మరో 4.30 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది.
AP government's key decision on elimination of pensions
TAGGED:
pensions