ప్రముఖ హీరో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. వారం రోజుల పాటు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రద్దీ నియంత్రణ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసం అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొణిదల ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన లేఖ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
'సైరా' చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతి - syeraa
చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రద్దీ నియంత్రణ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసం అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
సైరా చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి