ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మరో అడుగు - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వార్తలు

పోతిరెడ్డిపాడు సామర్థ్యం, నీటి మళ్లింపు సామర్థ్యాలను పెంచుతూ చేపట్టదలచిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు టెండర్లు పిలిచేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది.ఈ మొత్తం ప్రాజెక్టును ఐదు పనులుగా విడగొట్టి ప్రభుత్వం పాలనామోదం ఇచ్చినా వీటిని గుత్తేదారులకు అప్పగించేందుకు రెండు ప్యాకేజీలుగా విడగొట్టి టెండరు షెడ్యూలు విడుదల చేసే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు.

rayalaseema lifting scheme works
rayalaseema lifting scheme works

By

Published : May 20, 2020, 6:47 AM IST

రాష్ట్ర‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం, నీటి మళ్లింపు సామర్థ్యాలను పెంచుతూ చేపట్టదలచిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రూ.6,829.15 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు పాలనామోదం లభించింది. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు వివిధ కాలువల ప్రవాహ సామర్థ్యం పెంచే పనులూ ఇందులో ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టును ఐదు పనులుగా విడగొట్టి ప్రభుత్వం పాలనామోదం ఇచ్చినా వీటిని గుత్తేదారులకు అప్పగించేందుకు రెండు ప్యాకేజీలుగా విడగొట్టి టెండరు షెడ్యూలు విడుదల చేసే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు.

మరోవైపు చీఫ్‌ ఇంజినీరు ఈ పనులకు సాంకేతిక మంజూరుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోని సంగమేశ్వరం పాయింటు నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు అవసరమైన పంపుహౌస్‌లు, పైపులైన్ల ఏర్పాటు పనులు ఇందులో ఉన్నాయి. ఈ నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు ఎగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుడి ప్రధాన కాలువ వద్ద కలిపేలా పనులు చేయాలి. ఈ పని విలువ రూ.3,825 కోట్లుగా అంచనా వేశారు. ప్రధానంగా పంపుహౌస్‌లు, మోటార్లు, పైపులైన్ల పని అంతా ఒకే ప్యాకేజీగా విభజించి దీన్ని ఈపీసీ విధానంలో చేపట్టబోతున్నారని సమాచారం. ఆకృతులు సిద్ధం చేసుకోవడం తదితరాలకు సంబంధిత సంస్థలే బాధ్యత వహిస్తాయి.

ఆ పనులు ఎల్‌ఎస్‌ విధానంలో..
పోతిరెడ్డిపాడు నుంచి వివిధ జలాశయాలకు నీటిని తీసుకెళ్తారు. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకువెళ్లే కాలువల ప్రవాహ సామర్థ్యం పెంచనున్నారు. ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి కాలువలను గోరకల్లు జలాశయం వరకు ప్రవాహ సామర్థ్యం పెంచుతారు. గాలేరు-నగరిలో భాగంగా గతంలో ప్రతిపాదించిన గోరకల్లు ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ గోరకల్లు గేట్ల ఆధునికీకరణ వంటివి వేరే ప్యాకేజీ నుంచి 60సి కింద తొలగించి ప్రస్తుత పనుల్లో కలిపారు. ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి కాలువల లైనింగు పనులు చేపట్టబోతున్నారు. ప్రస్తుత కట్టడాల సామర్థ్యమూ పెంచనున్నారు. ఈ పనులన్నీ మరో ప్యాకేజీగా విడగొట్టి ఎల్‌ఎస్‌ పద్ధతిలో చేపట్టబోతున్నట్లు సమాచారం. టెండర్‌ ప్రకటన ముసాయిదా సిద్ధం చేశారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆమోదం చెప్పగానే టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. రివర్స్‌ టెండర్ల విధానంలోనే గుత్తేదారులను ఖరారుచేస్తారు.

ఇదీ చదవండి:

ఏపీ ఈఎన్​సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

ABOUT THE AUTHOR

...view details