రాష్ట్రంలో 10,143 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ (finance department) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీపీఎస్‌సీ (APPSC), డీఎస్‌సీ(DSC), పోలీసు నియామక బోర్డు( police recruitment board)కు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
AP Job Calendar: రాష్ట్రంలో 10,143 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి - ap govt green signal for jobs recruitment
15:00 June 18
ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2022 వరకూ భర్తీ చేసే 10వేల 143 ఉద్యోగాల వివరాలతో ముఖ్యమంత్రి జగన్(cm jagan).. జాబ్ క్యాలెండర్ (job calender) విడుదల చేశారు. అవినీతి, పక్షపాతం, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ ఉండనుందన్నారు. కేవలం మెరిట్ ఆధారంగానే భర్తీ ఉంటుందని సీఎం తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఎన్నో ఏళ్లుగా అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారని.. వారు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు భర్తీ చేపడుతున్నామని వెల్లడించారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేస్తామని.. ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: